: కాపులను బీసీల్లో చేర్చాలంటూ ఒక వ్యక్తి ఆత్మహత్య!


కాపులను బీసీల్లో చేర్చాలంటూ సూరిబాబు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఈరోజు జరిగింది. కాపులకు అన్యాయం చేయద్దని, ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని ఆ సూసైడ్ నోట్ లో సూరిబాబు పేర్కొన్నాడు. కాగా, నిన్న తునిలో జరిగిన కాపు ఐక్య గర్జన సదస్సు అనంతరం ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. తాజాగా, ఈ సంఘటన జరగడం ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందోనని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News