: కిం కర్తవ్యం!.. కాపు మంత్రులతో బాబు ప్రత్యేక భేటీ


విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో కాపు మంత్రులు, ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కాపు గర్జన సభ తరువాత జరిగిన పరిస్థితులపై చర్చించిన వీరు, ఆందోళన మరింతగా పెరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడుకున్నట్టు తెలిసింది. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు నారాయణ, దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర తదితరులు హాజరయ్యారు. వీరి సమావేశం ఇంకా కొనసాగుతోంది. కాపులకు రిజర్వేషన్లపై తక్షణం ఓ నిర్ణయానికి వద్దామని మంత్రులు చంద్రబాబుకు సూచించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News