: ఉద్దేశపూర్వకంగానే విధ్వంసం జరిగింది... 'కాపు గర్జన' అల్లర్లపై తేల్చిన పోలీసులు


నిన్నటి కాపు గర్జన తరువాత జరిగిన విధ్వంసం ఉద్దేశ పూర్వకంగా జరిగిందేనని పోలీసు ఉన్నతాధికారులు తేల్చారు. కొందరు ఆందోళనకారులు కావాలనే రైలుకు నిప్పు పెట్టారని, పోలీసు స్టేషన్ల విధ్వంసం కూడా అలాగే జరిగిందని అడిషనల్ డీజీ ఠాకూర్ వ్యాఖ్యానించారు. కాపు గర్జనకు తాము అనుమతి ఇవ్వలేదని, అయినప్పటికీ, తామెంతో సంయమనం పాటించామని ఆయన వివరించారు. సాంకేతిక పద్ధతుల ద్వారా నిందితులను గుర్తించే పనిలో ఉన్నామని తెలిపారు. పరిస్థితులు పూర్తిగా చక్కబడే వరకూ ఇక్కడే ఉంటానని వెల్లడించిన ఠాకూర్, నిందితులను సాధ్యమైనంత త్వరలో అరెస్ట్ చేస్తామని వివరించారు.

  • Loading...

More Telugu News