: కుర్రాళ్ల ముందు 170 పరుగుల స్వల్ప లక్ష్యం!


ఢాకాలో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ క్రికెట్ గ్రూప్ డీ మ్యాచ్ లో భాగంగా నేపాల్ తో తలపడ్డ భారత జట్టు ముందు 170 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంది. టాస్ గెలిచిన భారత జట్టు తొలుత ఫీల్డింగ్ ను ఎంచుకోగా, పొగమంచు కారణంగా 48 ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో నేపాల్ జట్టు 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఓపెనర్ సునార్ 37, రాజ్ బీర్ సింగ్ 35 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో అవేష్ ఖాన్ 3 వికెట్లు తీయగా, డాగర్, సుందర్ లు చెరో రెండు వికెట్లు తీశారు. మరి కాసేపట్లో 170 పరుగుల విజయలక్ష్యంతో భారత యువ జట్టు బరిలోకి దిగనుంది. గ్రూప్ డీలో ఉన్న నేపాల్, భారత్ లు రెండు దేశాలూ, చెరో రెండు విజయాలతో ఇప్పటికే తదుపరి దశకు దాదాపుగా అర్హతను సాధించాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టుకు క్వార్టర్ ఫైనల్స్ లో ప్రవేశం కచ్చితం కాగా, మరో స్థానం కోసం న్యూజిలాండ్, ఐర్లాండ్ లతో పాటు నేడు ఓడిపోయే జట్టు పోరాడాల్సి వుంది.

  • Loading...

More Telugu News