: ఆసక్తికర కేసు... సీతమ్మను వదిలినందుకు రామలక్ష్మణులపై కేసు, నేడు కోర్టు ముందుకు!
బీహార్ లోని సీతామారీ జిల్లా కోర్టు నేడు ఓ ఆసక్తికర కేసును విచారించనుంది. అది త్రేతాయుగపు కేసు కావడం, నిందితులుగా శ్రీరాముడు, లక్ష్మణుల పేర్లు ఉండటంతో ఈ కేసుపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. రామాయణంలో ఓ రజకుని మాటలను నమ్మి సీతమ్మను రాముడు అకారణంగా వదిలివేశాడని, నిజానిజాలు తెలుసుకోకుండా ఆయన సోదరుడు లక్ష్మణుడు ప్రవర్తించాడన్నది పిటిషనర్ ఆరోపణ. సీతామారీ న్యాయవాది ఠాకూర్ చందన్ ఈ పిటిషన్ దాఖలు చేయగా, అది నేడు బెంచ్ మీదకు రానుంది. ఈ కేసును విచారణకు స్వీకరించాలా? వద్దా? అన్న విషయమై నేడు వాదనలు విననున్న న్యాయస్థానం ఎటువంటి నిర్ణయం వెలువరిస్తుందోనని యూపీ న్యాయవ్యవస్థ ఎదురుచూస్తోంది.