: కాపులకు కోటా వివాదం - రద్దయిన రైళ్ల వివరాలు!
కాపు గర్జనలో ఉద్రిక్త పరిస్థితులు, ఆపై జరిగిన విధ్వంసం నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీందర్ గుప్తా వెల్లడించారు. సికింద్రాబాద్ లోని రైలు నిలయంలో పరిస్థితిని సమీక్షించిన ఆయన రద్దయిన రైళ్ల సమాచారాన్ని తెలిపారు. రద్దయిన రైళ్ల వివరాలివి... * సికింద్రాబాద్ - విశాఖపట్నం, గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ * తిరుపతి - విశాఖపట్నం, తిరుమల ఎక్స్ ప్రెస్ * విశాఖపట్నం - రాజమండ్రి, పాసింజర్ * రాయగడ - విజయవాడ, పాసింజర్ * విశాఖపట్నం - కాకినాడ, పాసింజర్ * విజయవాడ - రాయగడ, పాసింజర్ * మచిలీపట్నం - విశాఖపట్నం, పాసింజర్ * నరసాపూర్ - విశాఖపట్నం, పాసింజర్ * నిడదవోలు - భీమవరం, పాసింజర్ * విశాఖపట్నం - హైదరాబాద్, గోదావరి ఎక్స్ ప్రెస్ * విశాఖపట్నం - సికింద్రాబాద్, గరీబ్ రథ్ * విశాఖపట్నం - సికింద్రాబాద్, ఏసీ ఎక్స్ ప్రెస్ * విశాఖపట్నం - సికింద్రాబాద్, దురంతో ఎక్స్ ప్రెస్