: పఠాన్ కోట్ బాలలు ఈతకు వెళితే, బయటపడ్డ 'ఉగ్ర' ఆయుధాల డంప్!


పఠాన్ కోట్ పై దాడికి ఉగ్రవాదులు ముందుగానే ప్రణాళికలు రూపొందించి, అందుకోసం భారీ ఎత్తున ఆయుధాలను దాచి వుంచినట్టు వెల్లడైంది. ఈ నెలారంభంలో ఎయిర్ బేస్ పై దాడి తరువాత, ఈ ప్రాంతాన్నంతా జల్లెడ పడుతుండగా, జిల్లాలోని మాలిక్ పూర్ సమీపంలోని అప్పర్ బాలీ దోబ్ కాలువలో భారీ ఎత్తున ఆయుధాల డంప్ బయటపడింది. కొంతమంది బాలురు స్నానాలు చేసేందుకు కాలువలోకి దూకుతుండగా, వారికి ఈ డంప్ కనిపించింది. ఈ ప్రాంతంలో నిత్యమూ జనసంచారం, బాలల ఈతలాటలు సాగుతున్నప్పటికీ, నీటి స్థాయి తగ్గడంతోనే డంప్ గురించిన సమాచారం తెలిసిందని పఠాన్ కోట్ డీఎస్పీ కుల్ దీప్ సింగ్ వ్యాఖ్యానించారు. కాలువలో డంప్ దాచడం ప్రమాదకర సంకేతమేనని ఆయన అన్నారు. ఈ డంప్ లో ఏకే-47 తుపాకులతో పాటు రెండు మేగజైన్లు, 59 లైవ్ కార్టిడ్జ్ లు, ఇన్సాస్ రైఫిల్ కు చెందిన 29 లైవ్ కార్టిడ్జ్ లు, .315 కాలిబర్ రివాల్వర్ బులెట్లు లభించాయని తెలిపారు. ఇంకో ప్రాంతంలో ఎక్కడైనా మరో డంప్ దాచివుంచారా? అన్న విషయమై సోదాలను తీవ్రం చేసినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News