: గన్నవరం ఎయిర్ పోర్టును తాకిన పొగమంచు ఎఫెక్ట్!... విమానాల రాకపోకలకు అంతరాయం
పొగమంచు కారణంగా ఉత్తర భారతంలో రైలు, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. తాజాగా పొగమంచు ఏపీలోని కృష్ణా జిల్లాను కప్పేసింది. నేటి ఉదయం జిల్లాలోని ప్రధాన నగరం విజయవాడతో పాటు పలు ప్రాంతాలను దట్టమైన పొగమంచు ఆవరించింది. పొగమంచు కారణంగా విజయవాడ శివారులోని గన్నవరం విమానాశ్రయంలో విజిబిలిటీ శూన్య స్థానానికి చేరుకుంది. దీంతో విమానాశ్రయం నుంచి విమానాల రాకపోలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. గన్నవరం విమానాశ్రయానికి వస్తున్న విమానాల ల్యాండింగ్ కు పరిస్థితులు అనుకూలించడం లేదు. ఉదయం 10 గంటలు దాటితేనే కాని పరిస్థితిలో మార్పు వచ్చేలా లేదన్న భావన వ్యక్తమవుతోంది.