: తునిలో అదుపులోకి వచ్చిన పరిస్థితి... 144 సెక్షన్ విధించాం: జిల్లా ఎస్పీ ప్రకటన


కాపు ఐక్య గర్జనకు వచ్చిన కాపులు విధ్వంసానికి పాల్పడ్డ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా తునిలో నిన్న మధ్యాహ్నం నుంచే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గర్జనకు లక్షలాదిగా తరలివచ్చిన కాపులు ముద్రగడ పిలుపుతో ఒక్కసారిగా ధ్వంసరచనకు దిగారు. రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కు నిప్పు పెట్టడంతో ఎక్కడి రైళ్లక్కడే నిలిచిపోయాయి. బస్సులు కూడా నిలిచిపోయాయి. ఈ క్రమంలో తుని పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రజలు, ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. అల్లర్లను అణచివేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులపైనా కాపులు విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. అయితే వేగంగా స్పందించిన ఉన్నతాధికారులు భారీ సంఖ్యలో పోలీసులను రంగంలోకి దించారు. రాత్రిలోగా పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ మీడియాతో మాట్లాడారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని ఆయన ప్రకటించారు. అయితే అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తుని పరిసరాల్లో 144 నిషేధాజ్ఞలను అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News