: తుని ఘటనతో నిలిచిపోయిన రైళ్లు!


తూర్పు గోదావరి జిల్లా తునికి సమీపంలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలు బోగీలకు నిప్పుపెట్టిన సంఘటనతో ఆ మార్గంలో నడిచే పలు రైళ్లు ఆగిపోయాయి. ముఖ్యంగా విశాఖ-విజయవాడ మార్గంలో నడవాల్సిన పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కల్గింది. విశాఖ, గోదావరి, ఓకా ఎక్స్ ప్రెస్ రైళ్లను విశాఖపట్టణంలోనే ఆపి వేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. కాగా, రత్నాచల్ ఎక్స్ ప్రెస్ బోగీలకు కాపు ఐక్య గర్జన సదస్సు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఐదు బోగీలకు నిప్పుపెట్టడంతో మంటలు క్రమంగా పక్క బోగీలకు వ్యాపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News