: కేసీఆర్ మాటపై నిలబడే మనిషి కాదు: కిషన్ రెడ్డి


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటపై నిలబడే మనిషి కాదని బీజేపీ నేత కిషన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదని అన్నారు. కేసీఆర్ ని, ఆయన కుటుంబాన్ని కాదని ఏ ఒక్క మంత్రి సొంత నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి నెలకొందని ఆయన ఆరోపించారు. ‘గ్రేటర్’ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రజలు ఓటు వేస్తే సమస్యలు కొనితెచ్చుకున్నట్లేనని కిషన్ రెడ్డి అన్నారు.

  • Loading...

More Telugu News