: ఆన్ లైన్ పరిచయంలో ప్రేమన్నాడు, దోచుకున్నాడు... ఊచలు లెక్కిస్తున్నాడు!


ఆన్ లైన్ పరిచయాలు, ప్రేమలు యువతులను ఎన్ని ఇబ్బందుల పాలు చేస్తాయన్నదానికి ఇది సరికొత్త ఉదాహరణ. హైదరాబాద్ పరిధిలోని చిక్కడపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అతిగా జల్సాలకు అలవాటు పడ్డ యువకుడు మహ్మద్ యాసిన్ (19), తనకు ఫేస్ బుక్ లో పరిచయమైన యువతిని ప్రేమ పేరుతో వంచించాడు. ఆమెను ప్రేమ పేరుతో ముగ్గులోకి దించి ఆపై బ్లాక్ మెయిల్ చేశాడు. యాసిన్ బుట్టలో పడిన యువత తన ఇంటిలోనే దొంగగా మారి 12 తులాల బంగారు ఆభరణాలు, రూ. 20 వేల డబ్బును యాసిన్ కు ఇచ్చింది. మరింత డబ్బివ్వకుంటే, ప్రేమ వ్యవహారాన్ని యువతి అమ్మానాన్నలకు చెబుతానని బెదిరిస్తూ, మరింత డబ్బులు డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో ఇంట్లోని బంగారం కనిపించకపోవడంతో తమ కూతురిని నిలదీయడంతో అసలు విషయం వెల్లడైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టి, యాసిన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతని నుంచి బంగారాన్ని మాత్రం స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని, నిందితుడిని రిమాండ్ చేశామని తెలిపారు.

  • Loading...

More Telugu News