: మోదీ దగ్గరున్న డబ్బు కేవలం రూ. 4,700 మాత్రమే!


ఏదైనా ఖర్చు పెట్టాల్సి వస్తే, మోదీ దగ్గరున్న డబ్బెంతో తెలుసా కేవలం రూ. 4,700 మాత్రమే. మార్చి 31 2015 నాటికి ఆయన ఆస్తుల విలువ 2014తో పోలిస్తే 15 లక్షలు పెరిగి రూ. 1.26 కోట్ల నుంచిరూ. 1.41 కోట్లకు చేరింది. దీనిలో గాంధీనగర్ లో ఉన్న ఆయన ఇంటి విలువే రూ. 1 కోటి. కాగా, మిగతావన్నీ బ్యాంకు డిపాజిట్లే. ఇక ఏటీఎం కార్డుతో గీకితే బయటకు వచ్చేది మాత్రం రూ. 4,700 మాత్రమే. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాయలం తన అధికారిక వెబ్ సైట్లో ఉంచింది. ఆస్తుల వెల్లడిలో భాగంగా మోదీ ఆస్తిపాస్తుల వివరాలు బహిర్గతం కాగా, మిగతా అందరు మంత్రుల వద్దా ఆయనకన్నా ఎక్కువ డబ్బు అందుబాటులో ఉండటం గమనార్హం. ప్రధానికి ఇప్పటికీ సొంత కారు కూడా లేదని, 45 గ్రాముల బరువున్న నాలుగు బంగారపు ఉంగరాలు మాత్రం ఉన్నాయని పేర్కొంది. రూ. 31 లక్షల విలువైన బ్యాంకు డిపాజిట్లు, ఓ ఎల్ఐసీ పాలసీ, జాతీయ సేవింగ్స్ పథకాల్లో సూ. 7.5 లక్షల పెట్టుబడి ఉందని, దీనిపై ఆయన ఎటువంటిరుణాన్ని తీసుకోలేదని తెలిపింది. కాగా, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆస్తుల విలువ రూ. 2.73 కోట్ల నుంచి రూ. 4.54 కోట్లకు పెరుగగా, ఆమె వద్ద రూ. 1.05 లక్షల నగదు ఉంది. టెలికం మంత్రి రవిశంకర్ ఆస్తుల విలువ రూ. 20 కోట్లకు పైగా ఉండగా, ఆయన వద్ద రూ. 60,468 నగదు ఉంది. పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడి ఆస్తులు రూ. 20.45 లక్షల నుంచి రూ. 29.23 లక్షలకు పెరుగగా, చేతిలో రూ. 38 వేల నగదు ఉంది. ఆయన భార్య పేరిట మాత్రం రూ. 10 కోట్లకు పైగా ఆస్తులున్నట్టు పీఎంఓ వెల్లడించింది. న్యాయశాఖా మంత్రి సదానంద గౌడ ఆస్తులు మాత్రం రూ. 4.34 కోట్ల నుంచి రూ. 2 కోట్లకు తగ్గగా, స్మృతీ ఇరానీ రూ. 4.27 కోట్ల ఆస్తులను కలిగివున్నారని, ఆమె వద్ద రూ. 10.5 లక్షల నగదు ఉందని తెలిపింది. ఇక మోదీ టీంలో అత్యధిక ఆస్తులున్నది ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకే. ఆయన వద్ద రూ. 72 కోట్లకు పైగా విలువైన ఆస్తులున్నాయి. ఇదే సమయంలో హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ సహా పీయుష్ గోయల్, నితిన్ గడ్కరీ తదితరులు తమ ఆస్తిపాస్తుల వివరాలను ఇంకా ప్రకటించలేదు.

  • Loading...

More Telugu News