: మళ్లీ రష్యా యుద్ధ విమానం వచ్చింది... పేల్చకుండా వదిలేశామన్న టర్కీ


అంతర్జాతీయ గగనతల నిబంధనలను పదేపదే ఉల్లంఘించడం రష్యాకు అలవాటైపోయిందని టర్కీ విమర్శించింది. రష్యాకు చెందిన యుద్ధ విమానం ఒకటి టర్కీ గగనతలంపైకి వచ్చిందని, తమ రాడార్లు దాన్ని గుర్తించడంతో పలుమార్లు రష్యన్, ఇంగ్లీషు భాషల్లో హెచ్చరించడం జరిగిందని విదేశాంగ శాఖ వెల్లడించింది. సుఖోయ్-34 విమానం తమ భూభాగంపై చక్కర్లు కొట్టిందని, దాన్ని పేల్చే అధికారమున్నా, ఆ పని చేయలేదని వెల్లడించింది. ఈ విషయాన్ని రష్యన్ బ్రాండ్ అంబాసిడర్ దృష్టికి తీసుకెళ్లి తమ నిరసన తెలిపామని టర్కీ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా, రెండు నెలల క్రితం ఇదే విధంగా టర్కీ గగనతలంలోకి వచ్చిన రష్యా యుద్ధ విమానాన్ని ఆ దేశ విమాన విధ్వంసక క్షిపణులు నేలకూల్చగా, ఇరు దేశాల మధ్యా తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. సమస్యలను మరింత జటిలం చేయాలన్న ఉద్దేశంతోనే రష్యా నిబంధనలను మీరుతోందని టర్కీ ఆరోపిస్తోంది.

  • Loading...

More Telugu News