: గద్దెనెక్కిన తరువాత తొలిసారి మసీదుకెళ్లిన బరాక్ ఒబామా


అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం బరాక్ ఒబామా తొలిసారిగా ఓ మసీదును సందర్శించారు. మరికొన్ని రోజుల్లో ఆయన పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం. బాల్టిమోర్ లోని మసీదును ఆయన సందర్శించారని, ప్రజల్లో సహనం, మత స్వేచ్ఛ కోసం ఆయన ప్రార్థించారని వైట్ హౌస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా, 2010 ఇండోనేషియాను సందర్శించినప్పుడు ఆయన జకార్తాలోని ఓ మసీదును సందర్శించారు. అమెరికాలో మాత్రం ఎన్నడూ మసీదుకు వెళ్లలేదు. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి బరిలో ఉంటారని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఇటీవలి కాలంలో పలు ముస్లిం వ్యతిరేఖ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన పర్యటన జరగడం విశేషం. కాగా, మసీదుకు వెళ్లిన ఒబామా, అక్కడి మత పెద్దలతో సమావేశమయ్యారని, ముస్లిం మూల విధానాలకు కట్టుబడి వుండాలని కోరారని వైట్ హౌస్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News