: రాయలసీమ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా లేపాక్షి ఉత్సవాలు: ఎమ్మెల్యే బాలకృష్ణ
లేపాక్షి ఉత్సవాలను ఫిబ్రవరి 27, 28న నిర్వహించనున్నట్టు హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ తెలిపారు. ఉత్సవాల కోసం రూ.4.19 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. రాయలసీమ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తెలుగు, తమిళ, కన్నడ సినీ కళాకారులు కూడా ఉత్సవాల్లో పాల్గొనేలా చూస్తున్నామని వివరించారు. ఉత్సవాలకు అన్ని శాఖలను సమన్వయం చేస్తూ ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి మాణిక్యాలరావు చెప్పగా, అంతర్జాతీయ పర్యాటకులను లేపాక్షికి రప్పించటమే ఉత్సవాల్లో ప్రధాన అంశమని మంత్రి పల్లె రఘునాథరెడ్డి వివరించారు.