: కత్రినా సంతకంతో లోరియల్ బ్రాండ్ లిప్ స్టిక్, నెయిల్ పాలిష్
అంతర్జాతీయ సంస్థ లోరియల్ బ్రాండ్ కు బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తమ ఉత్పత్తులను మార్కెట్ లో మరింత కొత్తగా తీసుకెళ్లి ఆకట్టుకునేందుకు కత్రినా సంతకంతో కూడిన లిప్ స్టిక్, నెయిల్ పాలిష్ లను లోరియల్ విడుదల చేసింది. 'లివియన్ రోజ్' కలెక్షన్ పేరుతో అవి మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి. దానిపై కేట్ స్పందిస్తూ, తన సంతకంతో సౌందర్య ఉత్పత్తులు రావడం సంతోషంగా, గర్వంగా ఉందని తెలిపింది. గులాబీ రంగుల్లో ఉన్న లిప్ స్టిక్ లు, నెయిల్ పాలిష్ లంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది. గతంలో కూడా ఐశ్వర్యారాయ్, సోనమ్ కపూర్, హలీవుడ్ నటులు జూలియాన్నేమూర్, ఎవా లాంగోరియాల సంతకాలతో లోరియల్ ఈ ఉత్పత్తులను విడుదల చేసింది.