: టీఆర్ఎస్ 100 సీట్ల సవాల్ పై కేటీఆర్ తోక ముడిచారు: రేవంత్ రెడ్డి


గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ వంద సీట్లు గెలవకుంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చేసిన సవాల్ పై మంత్రి కేటీఆర్ తోక ముడిచారని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆ సవాల్ కు స్పందించిన తాను, టీఆర్ఎస్ గనుక 100 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పానని, గెలవకుంటే మీరు రాజకీయ సన్యాసం చేస్తారా? అని తాను అడిగితే సవాల్ కు స్పందించకుండా తోక ముడుచుకుని ఇంట్లో పడుకున్నారని వ్యాఖ్యానించారు. తానలా అనలేదని, మేయర్ పీఠం గెలవకుంటే రాజీనామా చేస్తానన్నానని కేటీఆర్ మాట మార్చారని ఎద్దేవా చేశారు. మొన్నీమధ్య మీడియా సమావేశంలో తమకు 80 సీట్ల వరకు రావచ్చని కేసీఆర్ చెప్పారన్నారు. అసలా పార్టీకి 30 సీట్లు కూడా రావని ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చిందని జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ అన్నారు. ఇదే సమయంలో నమస్తే తెలంగాణ పత్రికపై రేవంత్ తీవ్ర విమర్శలు చేశారు. అది 'నమస్తే తెలంగాణో', 'గుమస్తా తెలంగాణో' తెలియడం లేదన్నారు. బజ్జీల బడ్డి దగ్గర పొట్లాలకు తప్ప దేనికీ పనికిరాదన్నారు.

  • Loading...

More Telugu News