: ఇంటర్ విద్యార్థికి ఐఎస్ఐ ఇలా గాలమేసింది!
బీహార్ లోని భుబువాలో నివాసముంటూ ఇంటర్ విద్యను పూర్తి చేస్తూ బట్టల దుకాణంలో పార్ట్ టైమ్ పని చేస్తున్న ముఖేష్ కుమార్ కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. 'నీ కోసం ఓ బంపర్ ఆఫర్' వెయిట్ చేస్తోందని చెప్పారు. తమ సంస్థలో పని చేస్తే ఊహించనంత డబ్బు, అద్భుతమైన సౌకర్యాలు కల్పిస్తామని ఆ ఫోన్ చేసిన వ్యక్తి చెప్పారు. దానిని తేలిగ్గా తీసుకున్న ముఖేష్ కుమార్ పెద్దగా పట్టించుకోలేదు. అయితే శుక్రవారం అదే నెంబర్ నుంచి మరోసారి ఫోన్ కాల్ వచ్చింది. ఈ సారి ఆ ఆఫర్ ను రెట్టింపు చేశారు. తాము పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పడంతో, దీంతో ఆలోచిస్తానని చెప్పిన ముఖేష్ కుమార్... నేరుగా ఎస్పీని కలిసి ఈ ఫోన్ కాల్ గురించి వివరించాడు. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం అందించిన ఆయన, దీనిపై జాతీయ భద్రతా సంస్థలు చర్యలు తీసుకుంటాయని అన్నారు. ముఖేష్ కుమార్ ఆర్థిక ఇబ్బందుల గురించి తెలుసుకున్న గూఢచారులు ఈ ఆఫర్ ఇచ్చినట్టు భావిస్తున్నామని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామని ఆయన వివరించారు.