: సర్వేలో 'బాహుబలి' నెంబర్ వన్
'బాహుబలి' మరో ఘనతను సొంతం చేసుకుంది. రికార్డు స్థాయి వసూళ్లతో భాషా భేదాలను చెరిపేసిన 'బాహుబలి' సినిమా 'వర్డ్ ఆఫ్ మౌత్' సర్వేలో అగ్రస్థానంలో నిలిచింది. ఒర్ మాక్స్ అనే మీడియా సంస్థ ప్రేక్షకుల మౌత్ టాక్ తో విస్తృత ప్రజాదరణకు నోచుకున్న సినిమాలపై సర్వే నిర్వహించాయి. ఈ సర్వేలో మౌత్ టాక్ ద్వారా అశేషమైన ప్రేక్షకాదరణ పొందిన సినిమాగా 'బాహుబలి' నిలిచింది. ఆ తరువాత 'భజరంగీ భాయ్ జాన్', మూడవ స్థానంలో 'బాజీరావ్ మస్తానీ', తరువాతి స్థానాల్లో వరుసగా అజయ్ దేవగణ్ 'దృశ్యం', మాధవన్ 'తను వెడ్స్ మను రిటర్న్స్', అక్షయ్ కుమార్, రానాల 'బేబీ', అమితాబ్ 'పీకూ', 'తల్వార్', 'మాంఝీ', అక్షయ్ కుమార్ నటించిన 'గబ్బర్ ఈజ్ బ్యాక్' సినిమాలు నిలిచాయి.