: 'ఆదర్శ ముఖ్యమంత్రి' పురస్కారం అందుకున్న చంద్రబాబు


ఏపీ సీఎం చంద్రబాబు 'ఆదర్శ ముఖ్యమంత్రి' పురస్కారం అందుకున్నారు. పూణెలో నిర్వహించిన కార్యక్రమంలో భారతీయ ఛాత్ర సంసద్ సంస్థ ఈ పురస్కారాన్ని అందజేసింది. ఈ సందర్భంగా బాబుకు శాలువా కప్పి, పురస్కారాన్ని అందజేశారు. రాష్ట్ర అభివృద్ధిలో రైతు సంక్షేమం, ఐటీ వినియోగంలో చేసిన విశేష కృషికిగాను చంద్రబాబు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటుడు శత్రుఘ్నసిన్హా కూడా పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News