: ఆ షెడ్యూల్స్ లో ఉన్న సంస్థలే వివాదానికి కారణం!: సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నేడు పదవీ విరమణ చేస్తున్న ఐవైఆర్ కృష్ణారావు నవ్యాంధ్ర సమస్యల గురించి మాట్లాడారు. రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందని, రాష్ట్ర విభజనలో రాష్ట్రాల మధ్య సమస్యలు లేకుండా పరిష్కరించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. అయితే తెలంగాణ సీఎస్ తో కలసి తమ పరిధిలోని కొన్ని సమస్యలను పరిష్కరించగలిగామని చెప్పారు. ఈ సమయంలో సహకరించిన తెలంగాణ సీఎస్ కు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. ఏపీకి రాజధాని లేకపోవడమే పెద్ద సవాల్ అన్న సీఎస్, పునర్విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్స్ లో ఉన్న సంస్థలే వివాదాలకు అసలు కారణమని స్పష్టం చేశారు. రాష్ట విభజన అంశాల్లో తన పాత్రను పూర్తిగా నిర్వహించానని భావిస్తున్నానని, 37 ఏళ్ల ఐఏఎస్ జీవితం తనకు సంతోషాన్నిచ్చిందని ఐవైఆర్ తెలిపారు.