: మహేశ్ భట్ కు గురుదక్షిణగా వెయ్యి నోటు!


బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఎన్నో చిత్రాల్లో నటించి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఇప్పటికీ పలు ముఖ్యపాత్రల్లో నటిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఉన్నత జీవితాన్ని కొనసాగిస్తూ, పలువురికి తనవంతు సాయం చేస్తున్నారు. అయితే సినీ రంగంలో ఆయనకు మంచి గుర్తింపు, పేరు తెచ్చిన చిత్రం 'సారాంశ్'. ప్రముఖ దర్శకుడు మహేశ్ భట్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ విషయాన్ని అనుపమ్ మర్చిపోలేదు. అందుకే తన గురువు భట్ కు తాజాగా గురుదక్షిణ సమర్పించుకున్నారు. తనకు జీవితాన్ని ఇచ్చినందుకు గుర్తుగా రూ.1000 నోటు అందించారు. ఇది తీసుకుంటున్న సమయంలో మహేశ్ భట్ అనుపమ్ నుదుటి మీద ముద్దుపెట్టారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోను అనుపమ్ తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు చేశారు. ఇటీవల పద్మశ్రీ పురస్కారం పొందిన అనుపమ్ ను భట్ ట్విట్టర్ లో అభినందించారు.

  • Loading...

More Telugu News