: మరో సెల్ఫీ పంపిన నాసా క్యూరియాసిటీ రోబోటిక్ రోవర్
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పంపించిన క్యూరియాసిటీ రోబోటిక్ రోవర్ తాజాగా మరో సెల్ఫీని శాస్త్రవేత్తలకు పంపింది. నల్లని ఇసుక మేటల పక్కన క్యూరియాసిటీ రోవర్ తీసిన ఆ సెల్ఫీని నాసా ట్విట్టర్ లో పోస్టు చేసింది. గతంలో కూడా క్యూరియాసిటీ రోవర్ సెల్ఫీ తీసింది. అరుణగ్రహంపై పరిశోధన కోసం నాసా ఆ రోవర్ ను పంపింది. అక్కడ పరిశోధనలు చేస్తూ ఎప్పటికప్పుడు ఫోటోలు తీసి శాస్త్రవేత్తలకు పంపిస్తుంటుంది. దాంతో పాటు మట్టి నమూనాలు కూడా సేకరిస్తుంది.