: వివాదంలో ‘బాజీరావ్ మస్తానీ’...భన్సాలీ, రణవీర్, దీపికాలకు జబల్ పూర్ కోర్టు నోటీసులు
బాలీవుడ్ హిట్ చిత్రం ‘బాజీరావ్ మస్తానీ’ వివాదంలో చిక్కుకుంది. మధ్యప్రదేశ్ రాజవంశానికి చెందిన తమ్కీన్ అలీ బహదూర్ ను కించపరిచేలా చిత్రం ఉందన్న ఆరోపణలపై ఆ రాష్ట్రానికి చెందిన జబల్ పూర్ కోర్టు చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, హీరో హీరోయిన్లు రణవీర్ సింగ్, దీపికా పదుకొనె, ప్రియాంకా చోప్రాలకు నోటీసులు జారీ చేసింది. చిత్రంలో రాజవంశానికి చెందిన వారసులపై అసలు కథనాలను ప్రస్తావించని కారణంగా బహదూర్ ప్రతిష్ఠకు భంగం కలిగించారని మధ్యప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కు స్పందించిన కోర్టు ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. అంతేకాక దీనికి సంబంధించి నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని వారికి ఆదేశాలు జారీ చేసింది.