: రాహుల్ జీ...శవ రాజకీయాలు మానండి: నేడు తెలంగాణలో కళాశాలల బంద్ కు ఏబీవీపీ పిలుపు
హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యలో ఆరోపణలు ఎదుర్కొన్న బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ మొన్నటిదాకా సైలెంట్ గానే ఉంది. రోహిత్ ఆత్మహత్యను అవకాశంగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వర్సిటీలో పర్యటించడం, తాజాగా సామూహిక నిరాహార దీక్షలో పాలుపంచుకోవడంపై ఏబీవీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రోహిత్ ఆత్మహత్యను రాజకీయం చేస్తున్న రాహుల్ గాంధీ... శవ రాజకీయీలకు పాల్పడుతున్నారని విరుచుకుపడింది. రాహుల్ గాంధీ వైఖరికి నిరసనగా నేడు తెలంగాణ వ్యాప్తంగా కళాశాలల బంద్ కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. రోహిత్ దళితుడైనందుకే సంఘీభావం ప్రకటిస్తున్నానని చెప్పిన రాహుల్ గాంధీకి ఏబీవీపీ ఓ ప్రశ్నను సంధించింది. తమిళనాడులో ముగ్గురు దళిత విద్యార్థినీలు చనిపోతే దానిపై ఎందుకు స్పందించడం లేదని ఆ సంస్థ నిలదీసింది.