: స్మాల్ బ్రేక్ తీసుకున్న రాహుల్...‘సెంట్రల్’ దీక్షలో నేలపై కూర్చున్న కాంగ్రెస్ యువరాజు


ఆత్మహత్య చేసుకున్న రీసెర్చీ స్కాలర్ రోహిత్ వేముల బర్త్ డే సందర్భంగా హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో అతడి కుటుంబం, సహచర విద్యార్థులు చేపట్టిన సామూహిక నిరాహార దీక్షలో రాహుల్ గాంధీ పాలుపంచుకున్నారు. నిన్న రాత్రే ఢిల్లీ నుంచి హైదరాబాదు వచ్చిన రాహుల్ గాంధీ నేరుగా హెచ్ సీయూకు వెళ్లారు. విద్యార్థులు నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న రాహుల్ అర్ధరాత్రి నిరాహారదీక్షను ప్రారంభించారు. అయితే రాత్రి వేళ దీక్షలో కొద్దిసేపు కూర్చున్న రాహుల్, ఆ తర్వాత తన కోసం ఏర్పాటు చేసిన విడిదికి వెళ్లిపోయారు. స్మాల్ బ్రేక్ తీసుకున్న రాహుల్ నేటి ఉదయం 7 గంటలకల్లా తిరిగి దీక్షాస్థలికి చేరుకున్నారు. అక్కడ విద్యార్థుల మధ్య నేలపై కూర్చున్న రాహుల్ గాంధీ సాయంత్రం దాకా దీక్ష చేయనున్నారు.

  • Loading...

More Telugu News