: ఆసీస్ తో టీ20 సిరీస్ విక్టరీ... ధోనీకి లైఫ్ లైనే: అజారుద్దీన్ కామెంట్


జట్టుకు వరుస పరాజయాలు, వ్యక్తిగతంగా విఫలమవుతున్న తీరు... టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భవిష్యత్తుపై పెద్ద చర్చకే తెర తీశాయి. ఇప్పటికే టెస్టు కెరీర్ ను ముగించిన అతడు త్వరలోనే మిగిలిన రెండు ఫార్మాట్లకూ వీడ్కోలు పలకక తప్పదన్న వాదన వినిపించింది. అయితే నిన్న మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన టీ20 మ్యాచ్ లో 27 పరుగుల విక్టరీతో సిరీస్ కైవసం చేసుకున్న ధోనీకి లైఫ్ లైన్ చిక్కేసిందట. ఈ మేరకు టీమిండియా మాజీ కెప్టెన్ మొహ్మద్ అజారుద్దీన్ నిన్న ఆసక్తికర కామెంట్ చేశాడు. గడచిన రెండు మ్యాచ్ ల్లో ధోనీ కొత్త ఉత్సాహంతో కనిపించాడని, జట్టు విజయాలు అతడి మోములో కొత్త ఉత్తేజాన్ని నింపాయని అజారుద్దీన్ వ్యాఖ్యానించాడు. టీ20 సిరీస్ ను చేజిక్కించుకున్న దోనీ... ఇక మరింత కాలం పాటు క్రికెట్ ఆడతాడన్న విషయాన్ని స్పష్టం చేస్తోందని కూడా అతడు పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News