: టీఆర్ఎస్ పాలనపై ప్రశంసలు కురిపించిన హాస్యనటుడు సునీల్!
టీఆర్ఎస్ పాలనపై హాస్యనటుడు సునీల్ ప్రశంసల వర్షం కురిపించారు. చిత్ర పరిశ్రమకు టీ-సర్కార్ చేయబోయే కార్యక్రమాలు చాలా ఆనందాన్ని.. సంతోషాన్ని ఇచ్చాయని మంత్రి కేటీఆర్ తో సునీల్ అన్నారు. ఒక టీవీ చానెల్ నిర్వహించిన లైవ్ కార్యక్రమంలో ఈ విషయాన్ని ఆయన ఫోన్ ద్వారా తెలిపారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న ప్రణాళిక, లా అండ్ ఆర్డర్, విద్యుత్ సదుపాయం, మంచి నీటి వంటి సౌకర్యాలను చాలా చక్కగా అందిస్తున్నారని సునీల్ ప్రశంసించారు. మంచి ఎవరు చేస్తున్నా తాను సంతోషపడతానని, అటువంటి వారితో మాట్లాడాలని కోరుకుంటానని సునీల్ అన్నాడు.