: నీతిలేని వారు నీతులు చెబుతున్నారు: తలసానిపై బాబు విసుర్లు


నీతిలేని వారు నీతులు చెబుతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెట్టుగూడలో ఆయన మాట్లాడుతూ, మెట్టుగూడ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను గత ఎన్నికల్లో నిలబెడితే, గెలవలేనని చెప్పి, సనత్ నగర్ నియోజకవర్గం అడిగారని, సరే గెలిచే చోట సీటు కేటాయించాలని భావించి, సీటు ఇస్తే, టీడీపీ కార్డుతో గెలిచి నీతి బాహ్యమైన పని చేశారని అన్నారు. అలాంటి వ్యక్తులు టీడీపీ గురించి మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి నీతి మాలిన వ్యక్తులు చేసే వ్యాఖ్యలను పట్టించుకుంటారా తమ్ముళ్లూ? అని ఆయన అడిగారు. గ్రేటర్ ఎన్నికల్లో తమ్ముళ్లు ఆలోచించి ఓటేయాలని సూచించారు. నీతి తప్పిన పార్టీలకు ఓట్లేస్తే ప్రజాస్వామ్య పరిరక్షణకు అవకాశం ఉంటుందా? అని ఆయన అడిగారు. లెక్కలేనన్ని హామీలు ఇస్తూ, చేతలకు వచ్చేసరికి చేతులెత్తేసే నేతలకు అవకాశం ఇస్తే ఉపయోగం ఉంటుందా? అని అడిగారు. గతంలో తన పనితీరును అందరూ చూశారని ఆయన గుర్తు చేశారు. గ్రేటర్ లో టీడీపీని గెలిపించాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News