: నాపై వంద కేసులు పెట్టినా భయపడేది లేదు: ఎంపీ మిథున్ రెడ్డి
నెల్లూరు సబ్ జైలు నుంచి విడుదలైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇవాళ పార్టీ నేతలతో కలసి మీడియాతో మాట్లాడారు. ప్రజల తరపున పోరాటం చేస్తున్నందుకే తమపై ఏపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని ఆరోపించారు. ఇలాంటి కేసులు వంద పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని, తమ పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని మిథున్ రెడ్డి ప్రశ్నించారు. అధికారం ఉందని చంద్రబాబు ప్రభుత్వం విర్రవీగుతోందని మండిపడ్డారు.