: బాంబులకే భయపడలా...ఇక నేను ఎవ్వరికి భయపడతాను?: చంద్రబాబు
‘ఇందిరాగాంధీకి భయపడలా.. రాజీవ్ గాంధీకి భయపడలా..సోనియమ్మకు భయపడలా.. బాంబులకే భయపడలా... నేను ఎవ్వరికీ భయపడను’ అంటూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్వేగంగా ప్రసంగించారు. హైదరాబాద్ సనత్ నగర్ లోని పాటిగడ్డలో ఈరోజు నిర్వహించిన ‘గ్రేటర్’ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ వాళ్లను చూసి తానేదో భయపడుతున్నానని అంటున్నారని, ప్రజాసేవ చేయదలచుకున్న తాను ఎవ్వరికీ భయపడనని, ప్రజలు కూడా ఎవ్వరికీ భయపడవద్దని అన్నారు. 2003లో తిరుపతిలో తనపై బాంబు దాడులకు పాల్పడినప్పుడే తాను భయపడలేదని...క్లైమోర్ మైన్ లను బ్లాస్ట్ చేస్తే అటూఇటూ వెళ్లాయి తప్పా తననేమీ చేయలేకపోయాయని... వెంకటేశ్వరస్వామి తనను కాపాడాడని అన్నారు.