: కేరళ సీఎం ఊమెన్ చాందీకి హైకోర్టులో ఊరట
కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీకి ఆ రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. సౌర ఫలకాల కుంభకోణంలో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న త్రిశూర్ విజిలెన్స్ కోర్టు ఆదేశాలపై హైకోర్టు రెండు నెలల స్టే విధించింది. సౌర ఫలకాల స్కాంలో చాందీ లంచం తీసుకున్నారంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు చాందీ రాజీనామా చేయాలని కేరళ సెక్రటేరియట్ ఎదుట ఇవాళ విద్యార్థులు, నిరసనకారులు ఆందోళన చేశారు.