: కోల్ కతాకు చెందిన ముగ్గురు విప్రో ఉద్యోగుల అరెస్టు


ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ విప్రోలో పనిచేస్తున్న కోల్ కతాకు చెందిన ముగ్గురు ఉద్యోగులు అరెస్టయ్యారు. ఆ సంస్థ నిర్వహిస్తున్న కాల్ సెంటర్ లో వారు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బ్రిటన్ కు చెందిన టెలికాం కంపెనీ టాక్ టాక్ సంస్థకు సంబంధించిన విలువైన సమాచారం గతేడాది అక్టోబర్ లో హ్యాకింగ్ కు గురైన విషయం తెలిసిందే. దాంతో కస్టమర్ల విలువైన సమాచారం చోరీ అవడం సంచలనం రేపింది. ఈ క్రమంలో డిసెంబరులో టాక్ టాక్ నిర్వహించిన భద్రతా సమీక్షలో ఆ ముగ్గురు ఉద్యోగులు భద్రతా నిబంధనలు అతిక్రమించారని పోలీసులు గుర్తించారు. దాంతో వారిని అరెస్టు చేసినట్టు బ్రిటీష్ మీడియా తెలిపింది. అయితే వారి అరెస్టులకు, హ్యాకింగ్ కు సంబంధంలేదని, అయినా విప్రోతో తమ సంబంధాలను సమీక్షించుకుంటామని టాక్ టాక్ ప్రకటించింది.

  • Loading...

More Telugu News