: అరెస్ట్ నుంచి ధోనీకి ఊరట!... ‘అనంత’ కోర్టు వారెంట్లపై సుప్రీం స్టే
మేగజీన్ కవర్ పేజీపై విష్ణుమూర్తి అవతారంలో దర్శనమిచ్చిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అరెస్ట్ నుంచి ఊరట లభించింది. ఈ మేరకు ఏపీలోని అనంతపురం కోర్టు జారీ చేసిన వారెంట్లను నిలుపుదల చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితం కీలక నిర్ణయం తీసుకుంది. వారెంట్లపై స్టే విధించిన సుప్రీంకోర్టు, ఈ కేసులో తదుపరి విచారణను కూడా నిలుపుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం నిర్ణయంతో ఈ నెల 25 లోగా అనంతపురం కోర్టుకు ధోనీ రావాల్సిన అవసరం లేదు.