: ఆకాశయానంలో గోల చేస్తే సంకెళ్లే!... విమానాల్లో ఇకపై బేడీలు ఉంటాయట!


కేంద్ర పౌర విమానయాన శాఖ నిన్న కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆకాశయానానికి వెళ్లే అన్ని దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో సంకెళ్లను విధిగా అందుబాటులో ఉంచాలని ఆ శాఖ నిర్ణయించింది. ఇటీవల హైదరాబాదు నుంచి రాయ్ పూర్ వెళ్లేందుకు సిద్ధమైన ఇండిగో ఫ్లైట్ లో 70 మంది ప్రయాణికులు విమాన సిబ్బందిపై శృతి మించి వ్యవహరించారు. చిర్రెత్తుకొచ్చిన సిబ్బంది మొత్తం ప్రయాణికులందరినీ కిందకు దించేసి ఖాళీగానే రాయ్ పూర్ వెళ్లిపోయింది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపిన కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు... విమానాల్లో సంకెళ్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇకపై అన్ని విమానాల్లోను బేడీలను విధిగా అందుబాటులో ఉంచుతారు. ప్రయాణాల్లో అల్లరి చేసే ప్రయాణికులకు ముందుగా నచ్చజెప్పే సిబ్బంది, వారిని నిలువరించేందుకు అవసరమైతే మధ్యవర్తిత్వం కూడా నెరపుతారు. అప్పటికీ పరిస్థితి దారికి రాకపోతే, సదరు ప్రయాణికుల చేతులకు ప్లాస్టిక్ బేడీలు వేసేస్తారు. విమానం గమ్యం చేరేదాకా సదరు ప్యాసెంజర్లు సంకెళ్లతోనే ప్రయాణించాల్సి ఉంది. ఇప్పటికే పలు దేశాల్లో ఈ నిబంధన అమల్లో ఉంది. తాజాగా దేశీయ విమాన సర్వీసుల్లోనూ ప్రయాణికులు అల్లర్లకు దిగుతున్న కారణంగా విమానాల్లో బేడీలను అందుబాటులో ఉంచుకునే విషయంపై 2014లోనే డీజీసీఏ అనుమతి ఇచ్చింది. అయితే కేంద్రం అనుమతి లేకపోవడంతో బేడీలు ఇప్పటిదాకా విమానాల్లోకి ఎంట్రీ ఇవ్వలేకపోయాయి. తాజాగా అశోక్ గజపతిరాజు తీసుకున్న సంచలన నిర్ణయంతో సంకెళ్లు విమానాల్లో అందుబాటులోకి రానున్నాయి. ఇకపై ఆకాశయానానికి వెళ్లేటప్పుడు వాటిని ఓసారి గుర్తుకు తెచ్చుకోవాలి. లేదంటే, అల్లరి చేస్తే చేతులకు బేడీలు పడిపోవడం ఖాయమే.

  • Loading...

More Telugu News