: బాబా రాందేవ్ పతంజలి ఫుడ్ పార్క్ పై స్థానికుల దాడి
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ కు చెందిన పతంజలి ఫుడ్ పార్క్ పై దాడి చేసిన ఘటన ఉత్తరాఖండ్ లో చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్ లోని పదార్థా ప్రాంతంలో పతంజలి ఫుడ్ పార్క్ ఉంది. ఈ ఫుడ్ పార్కులో ఇటీవల ఓ ఉద్యోగి మృతి చెందాడు. అతనికి ఎలాంటి పరిహారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు ఫుడ్ పార్క్ పై దాడికి దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు స్థానికులపై లాఠీ ఛార్జ్ చేశారు. ఈ లాఠీ ఛార్జ్ లో 20 మంది స్థానికులకు గాయాలయ్యాయి. పతంజలి యాజమాన్యం ఫిర్యాదుతో కేసులు నమోదు చేసిన పోలీసులు, ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.