: స్మార్ట్ సిటీ పేరిట కాకినాడకు అందనున్న సౌకర్యాలివే!
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ సిటీ జాబితాలో స్థానం సంపాదించుకున్న కాకినాడలో సరికొత్త సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. కాకినాడకు స్మార్ట్ సిటీ కింద ప్రతి ఏటా 200 కోట్ల రూపాయల చొప్పున ఐదేళ్ల పాటు కేంద్రం అందజేయనుంది. ఏడు జోన్లుగా కాకినాడను విభజించి అభివృద్ధి చేపట్టనున్నారు. వివేకానంద పార్కులో గోదావరి కళాక్షేత్రం నిర్మించనున్నారు. పాత మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ లో బడ్జెట్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. కుళాయి చెరువు వద్ద మల్టీప్లెక్స్ ధియేటర్లతో కూడిన వాణిజ్య సముదాయాల నిర్మాణం చేపట్టనున్నారు. జపాన్ సాయంతో కాకినాడను అభివృద్ధి చేయనున్నారు.