: విశాఖకు స్మార్ట్ సిటీ పేరిట వచ్చే కొత్త హంగులు ఇవే!
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ సిటీల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు పట్టణాలు ఎంపికయ్యాయి. స్మార్ట్ సిటీ పేరిట విశాఖను కేంద్రం ప్రకటించడంతో జీవీఎంసీ పరిధిలో ఏర్పడనున్న సరికొత్త సౌకర్యాలను కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ప్రకటించింది. వాటి వివరాల్లోకి వెళ్తే... విశాఖపట్టణంలో పది వేల మందికి సరిపడా అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించనున్నారు. నిరంతరాయ నీటి సరఫరాకు ఏర్పాట్లు చేస్తారు. విశాఖను టూరిజం హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో వాటర్ స్పోర్ట్స్ ను ఏర్పాటు చేస్తారు. జీవీఎంసీ పరిధిలోని 1700 ఎకరాల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అలాగే విశాఖను సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు ముందుకు వచ్చిన అమెరికా సాయంతో విశాఖను అభివృద్ధి చేయనున్నారు.