: 2015 'శ్రీమంతుడు' సల్మానే...20 కోట్ల ఇన్ కమ్ టాక్స్ చెల్లించాడు
బాలీవుడ్ శ్రీమంతుడిగా సల్మాన్ ఖాన్ నిలిచాడు. మార్చ్ నెల దగ్గర పడుతుండడంతో ఇన్ కం ట్యాక్సుల చెల్లింపులు ప్రారంభమయ్యాయి. దీంతో 2015వ సంవత్సరానికి గాను సల్మాన్ ఖాన్ 20 కోట్ల రూపాయలను అడ్వాన్స్ ఇన్ కం ట్యాక్స్ గా చెల్లించాడు. 2014లో అక్షయ్ కుమార్ 16 కోట్ల రూపాయల పన్ను చెల్లించగా, గతేడాదికి సల్మాన్ టాప్ ట్యాక్స్ పేయర్ గా నిలిచాడని ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ తెలిపింది. గతేడాది సల్మాన్ నటించిన 'భజరంగీ భాయ్ జాన్', 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' సినిమాల్లో నటించగా, 'హీరో' సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఏడాది చివర్లో 'బిగ్ బాస్' సీజన్ 9కు వ్యాఖ్యాతగా వ్యవహరించి భారీ పారితోషికం అందుకున్న సంగతి తెలిసిందే. ఆయన తరువాతి స్థానంలో రణ్ బీర్ కపూర్ (15 కోట్లు), షారూఖ్ ఖాన్ (14 కోట్లు), అమితాబ్ బచ్చన్ (8.75 కోట్లు) ఉన్నారు.