: రెండు రాష్ట్రాలు సహకరించుకోవాలనే కేసీఆర్ యాగానికి వెళ్లా: చంద్రబాబు


హైదరాబాద్ లో సీఎం చంద్రబాబుకు ఏం పనంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించడంపై బాబు స్పందించారు. కేసీఆర్ వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. టీడీపీకి హైదరాబాద్ లో ఏం పనని కొందరు అంటున్నారని, తెలుగు జాతి ఎక్కడ ఉంటే అక్కడ టీడీపీ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు చందానగర్ లో జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, తన రాజకీయ జీవితం ఇక్కడే ప్రారంభించానని, తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రా అన్న తేడా లేకుండా అందరూ తనను అభిమానిస్తారని చెప్పారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీ ఎవరికీ భయపడదన్నారు. అమరావతికి శంకుస్థాపన సమయంలో నేరుగా తానే వచ్చి తెలంగాణ సీఎంను ఆహ్వానించానని గుర్తు చేశారు. ఆయన చండీయాగం చేస్తే తాను వెళ్లి భాగస్వామి అయ్యానని తెలిపారు. ఇదంతా రాష్ట్రం రాష్ట్రం సహకరించుకోవాలనే చేశానన్నారు. రాజకీయం వేరు, ప్రభుత్వాలు వేరని, పార్టీ పరంగా ఎట్టి పరిస్థితుల్లోను తాను రాజీపడనని బాబు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News