: మంత్రి పద్మారావు పర్యటనలో అపశృతి... టీఆర్ఎస్ కార్యకర్త మృతి!


‘గ్రేటర్’ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ నిర్వహిస్తున్న ప్రచార సభలో అపశృతి చోటుచేసుకుంది. మెట్టుగూడ టీఆర్ఎస్ అభ్యర్థి భార్గవికి మద్దతుగా మంత్రి పద్మారావు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో వారు మెట్టుగూడ డివిజన్ టీడీపీ కార్యాలయం ముందుకు చేరుకున్న సమయంలో తొక్కిసలాట జరగడంతో రవి(42) అనే కార్యకర్త మృతి చెందాడు. అతని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు పార్టీ నేతలు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News