: చంద్రబాబుకు ఇక్కడేమి పని?: కేసీఆర్


‘ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఇక్కడేమి పని?’ అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన పైవిధంగా స్పందించారు. చంద్రబాబు తన హయాంలో సమస్యలను ఎందుకు పరిష్కరించలేదని అన్నారు. చంద్రబాబు తన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని, ఓట్ల కోసం హైదరాబాద్ లో ప్రశాంతతను దెబ్బతీయవద్దని సూచించారు. ఉద్యమ సమయంలో తమను వ్యతిరేకించిన వాళ్లనే తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. హైదరాబాద్ లో ఉండే వాళ్లందరూ తమకు సమానమేనని, అన్ని సంక్షేమ పథకాలను అందరికీ సమానంగా వర్తింపజేస్తామని చెప్పారు. హైదరాబాద్ నగరంలో పేదల కోసం లక్ష ఇళ్లు కట్టించి తీరుతామని, నూతన సచివాలయ నిర్మాణం చేపట్టబోతున్నామని, ఉస్మానియా ఆసుపత్రి ఆవరణలో రెండు కొత్త టవర్లు నిర్మించనున్నామని కేసీఆర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News