: ప్రాజెక్టుల రీడిజైన్ పై మరింత అధ్యయనం చేయాలి: జానారెడ్డి


తెలంగాణ రాష్ట్రంలో ప్రాణహిత-చేవెళ్లతో పాటు పలు సాగునీటి ప్రాజెక్టులను రీడిజైన్ చేయడంపై ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని సీఎల్పీ నేత జానారెడ్డి సూచించారు. ప్రాజెక్టుల రీడిజైన్ వల్ల అదనపు ఖర్చవుతుందని చెప్పారు. ఈ మేరకు హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయం గాంధీభవన్ లో జానా మాట్లాడారు. గోదావరి జిల్లాల వినియోగంపై సూచనలతో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని, జాతీయ, అంతర్జాతీయ నిపుణులు, అఖిలపక్షం సూచనలు తీసుకోవాలని అన్నారు. ఇతర రాష్ట్రాలతో పేచీలేని తక్కువ ఖర్చయ్యే ప్రాజెక్టులు చేపట్టాలని పేర్కొన్నారు. మిగులు జలాలపై ఆధారపడి ప్రాజెక్టు నిర్మాణం మంచిది కాదని హితవు పలికారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును స్వాగతిస్తున్నామని, అలాగే పెండింగ్ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని జానా కోరారు.

  • Loading...

More Telugu News