: ఏపీలో ఆరోగ్యమిత్ర ఉద్యోగులను కొనసాగించాలని హైకోర్టు ఆదేశం
వైద్య ఆరోగ్యమిత్ర ఉద్యోగుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. తొలగించిన ఆరోగ్య మిత్ర ఉద్యోగులను కొనసాగించాలని ఉమ్మడి హైకోర్టు ఇవాళ ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తమను విధుల నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ 55 మంది ఆరోగ్య మిత్ర సిబ్బంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విద్యార్హతను కారణంగా చూపి విధుల నుంచి తొలగించారని, ప్రభుత్వ నిర్ణయంతో సుమారు 2వేల మంది వీధిన పడుతున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం పైవిధంగా స్పందించింది.