: మావోయిస్టు దంపతుల మృతదేహాలు స్వగ్రామానికి తరలింపు


మూడు రోజుల క్రితం ఒడిశా ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడు సుశీల్, భార్య సోనీ మృతదేహాలను వరంగల్ జిల్లా నర్సంపేట మండలం బాండీపేటకు తరలించారు. ఈరోజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఒడిశా దియోగఢ్ ఎన్ కౌంటర్ లో ఈ మావోయిస్టు దంపతులు హతమయ్యారు. కాగా, సుశీల్ అలియాస్ వీరన్న అలియాస్ పుట్టపాక కుమారస్వామి, ఆయన భార్య భార్య సోనీ లు అనుగుల్, దేవ్గడ్ సరిహద్దు బారొకోట్ సమితీ పచేరీపాణి అటవీ ప్రాంతంలో ఆదివారం జరిగిన కాల్పుల్లో మృతి చెందారు. ఇరవైఐదేళ్ల క్రితమే సుశీల్ అజ్ఞాతంలోకి వెళ్లారు.

  • Loading...

More Telugu News