: తిరుపతిలో ‘ఉగ్ర’ సింపథైజర్... పట్టేసిన కర్ణాటక పోలీసులు


తిరుమల వెంకన్న పాదాల చెంత తిరుపతిలో ఉగ్రవాదుల కలకలం రేగింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారుల సోదాల్లో భాగంగా నేటి ఉదయం విష్ణునివాసం సమీపంలోని డ్రైనేజీలో రెండు తుపాకులు లభ్యమైన కొన్ని క్షణాల్లోనే తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తిని కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదులకు సానుభూతిపరుడిగా వ్యవహరిస్తున్నాడన్న కారణంగా అతడిని అరెస్ట్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల బెంగళూరులో అరెస్టైన ఉగ్రవాది ఒకడు విచారణలో భాగంగా వెల్లడించిన విషయాలతో అప్రమత్తమైన ఎన్ఐఏ అధికారులతో పాటు కర్ణాటక, ఏపీ పోలీసులు నగరంలో ముమ్మర సోదాలు చేస్తున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రంలోకి ఉగ్రవాదులు ప్రవేశించారన్న వార్తలతో తిరుపతి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

  • Loading...

More Telugu News