: కడప జిల్లాలో కారు బీభత్సం... విద్యార్థులపైకి దూసుకెళ్లిన కారు, ఒకరు దుర్మరణం
ఏపీలోని కడప జిల్లాలో కొద్దిసేపటి క్రితం ఓ కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో దూసుకువచ్చిన ఆ కారు చక్కగా తయారై పాఠశాలకు వెళుతున్న చిన్నారులపైకి దూసుకెళ్లింది. జిల్లాలోని చిట్వేల్ మండలం సిద్ధారెడ్డిపల్లి సమీపంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో నాలుగో తరగతి చదువుతున్న ఆదెమ్మ అనే విద్యార్థిని దుర్మరణం పాలైంది. ప్రమాదంలో మరో విద్యార్థికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెనువెంటనే స్పందించిన స్థానికులు గాయపడ్డ విద్యార్థినిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.