: ఈసారి ఆర్టీసీ బస్సు వంతు... రన్నింగ్ లో ఉండగానే పులివెందుల బస్సులో మంటలు


రన్నింగ్ లో ఉండగానే బస్సుల్లో మంటలు ఎగసిపడుతున్న ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. నిన్నటిదాకా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లోనే ఈ తరహా ప్రమాదాలు సంభవించగా, తాజాగా ఆర్టీసీ బస్సులోనూ ఇలాంటి ప్రమాదమే జరిగింది. కడప జిల్లా పులివెందుల ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు 60 మంది ప్రయాణికులతో కర్ణాటక రాజధాని బెంగళూరుకు బయలుదేరింది. ఏపీ సరిహద్దులు దాటి కర్ణాటకలోకి ఆ బస్సు ప్రవేశించింది. కోలార్ జిల్లా చింతామణి తాలూకా గౌనిపల్లి వద్దకు రాగానే రన్నింగ్ లో ఉండగానే బస్సులో మంటలు చెలరేగాయి. వీటిని గుర్తించిన స్థానికులు అప్రమత్తంగా వ్యవహరించి బస్సును నిలిపేసి ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించేశారు. ఈ ప్రమాదంలో ఏ ఒక్కరికి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

  • Loading...

More Telugu News