: పవన్ కల్యాణ్ కు రావాల్సిన రూ.2 కోట్లు ఇవ్వమని చెప్పాం: సినీ నటుడు రాజేంద్రప్రసాద్
ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ కు రావాల్సిన రూ.2 కోట్లు ఇవ్వాలని మా అసోసియేషన్ తరపున నిర్మాతను కోరామని మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనం సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆయన తలనీలాలు సమర్పించుకున్నారు. దర్శనానంతరం ఆలయం బయట ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అత్తారింటికి దారేది చిత్రానికి సంబంధించి పవన్ కల్యాణ్ కు బకాయిపడ్డ మొత్తాన్ని ఇవ్వాలని ఆ చిత్ర నిర్మాతకు చెప్పామన్నారు. తాను ప్రధాన పాత్ర పోషించిన నాన్నకు ప్రేమతో చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా, టీటీడీ పాలకమండలి సభ్యుడు, ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కూడా వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు.